- కోల్లూరు బ్రిడ్జీ వద్ధ డంప్
- తెలంగాణ, మహరాష్ట్రకు తరలింపు
- ఇసుక దందాలో ఆదిపత్య పోరు
- పోలీస్, రెవిన్యూ శాఖలకు పరస్పర ఫిర్యాదులు
- ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన ఫలితం శూన్యం
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మంజీరా నదిలో నిశి రాత్రిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్ధు ప్రాంతమైన పొతంగల్ మండలంలో నదిలో అక్రమంగా రాత్రివేళ ఇసుకను తవ్వకాలు చేసి తరలిస్తున్నారు ఇసుకాసురులు. గతంలో పోతంగల్ చెక్ పోస్టును రాత్రికి రాత్రి దహనం చేసిన ఇసుక మాఫీయా కొల్లురు బ్రిడ్జీ వద్ధ ఇసుకను డంప్ చేసి అదే ఇసుకను తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్ధులను దాటించి సోమ్ము చేసుకుంటుంది. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం ( గస్తీ దళం) కళ్లు గప్పి ఇసుక రాత్రివేళ తరలిపోతుంది. పోతంగల్ మండలం సుంకిని, కొల్లూరు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అటు రెవిన్యూ, ఇటు మైనింగ్, పొలీస్ శాఖలకు మాత్రం కాసులు కురిపిస్తోంది.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామం మంజీరా శివారు ప్రాంతంలో ప్రతిరోజు రాత్రి భారీగా ఇసుక తరలింపు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ టీం లో ఏర్పడి ప్రతిరోజు రాత్రిపూట గస్తీ నిర్వహించి గట్టి బందోబస్తు గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇసుక మాఫియాదారులు వారి కళ్ళు కప్పి జోరుగా ఇసుకను అక్రమంగా మహారాష్ట్రతో పాటు పలుచోట్లకి తరలిస్తు ఈ వ్యాపారం ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. సుంకిని మంజీరా నది నుంచి ప్రతిరోజు ఇసుకను కొల్లూరు బ్రిడ్జి వద్ద డంప్ చేసి, అనంతరం టిప్పర్లు లారీల లో నింపి నగరాలు, పట్టణాలు వివిధ చోట్లకి తరలిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పోతంగల్ మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కొడిచెర్ల, సుంకిని, కారేగావ్ తో పాటు పలు మంజీరా సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఇసుక అక్రమంగా రవాణా అవుతుందని, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినప్పటికీ, రాత్రి నుంచి ఉదయం వరకు టిప్పర్లు , డోజర్లు ,అదేవిధంగా 16 టైర్ల లారీల ద్వారా ఇసుక అక్రమంగా భారీగా రవాణా అవుతున్నప్పటికీ అధికారులు అటువైపు చూడకుండా వారిచ్చే మామూళ్ల మత్తులో మునుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోడి చర్ల వాగు నుంచి ప్రతిరోజు మహారాష్ట్రకు వందల ట్రిప్పుల ట్రాక్టర్లు, టిప్పర్లు ఇతర వాహన ద్వారా ఇసుక భారీగా పోతున్నప్పటికీ పట్టించుకునే నాధులు కరువు అయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోడిచర్ల గ్రామస్తులు మాత్రం తమ గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇసుకను పోతంగల్ ఇసుక వ్యాపారస్తులతోపాటు చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న కొంతమంది మహారాష్ట్రలోని ఇసుక వ్యాపారస్తులు కలిసి దొంగలించిపోతున్నారని మండిపడుతూ గ్రామస్తులంతా కలిసి తాసిల్దార్ వద్దకు ఎస్సై వద్దకు వెళ్లిన పరిస్థితి ఫిర్యాదు ఇచ్చిన సంఘటన నెలకొంది. అధికారులకు వద్దకు వెళ్లిన కోడిచర్ల గ్రామస్తులు మాట్లాడుతూ పొతంగల్ వారు మహారాష్ట్ర వారు కలిసి కోడిచర్ల సరిహద్దు మంజీరా ప్రాంతం నుంచి ప్రతి రోజు రాత్రిపూట భారీగా ఇసుకను మహారాష్ట్రకు తరలిస్తున్నారని, కోడిచర్ల ఇసుకపై పోతంగల్ వారి ఆదిపత్యం ఏమిటని, మా గ్రామ ఇసుకను పోతంగల్ వారికి అప్పజెప్పడం ఏమిటని కోడి చర్ల గ్రామస్తులు కోరుతూ వినతి పత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామ సరిహద్దు ప్రాంతం నుంచి ప్రతి రోజు జరుగుతున్న అక్రమ ఇసుకను అరికట్టాలని పోతంగల్ తాసిల్దార్ ,కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ గ్రామ మంజీరా సరిహద్దు పరివాహక ప్రాంతంలోని ఇసుకను ప్రతిరోజు రాత్రి భారీగా పొతంగల్ వారి సహకారంతో మహారాష్ట్ర వారు తీసుకుపోతున్నారని మండిపడ్డారు. కొడిచర్ల శివారు నందు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కట్టుచున్నారు అని ఇసుక రాత్రి పగలు అని తేడా లేకుండా భారీగా త్రవ్వకలు చేస్తుంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి పంట పొలాలకు బోర్లలో నీరు తగ్గిపోయి వేల ఎకరాల వరి పంట తో పాటు ఇతర పంట పొలాలు నష్టపోయే ప్రమాదం ఉన్నదని రైతులు తెలిపారు.
ఇసుక అనుమతులు లేకున్నా పోతంగల్ గ్రామ ఇసుక వ్యాపారులు సిరిపూర్ గ్రామ ఇసుక వ్యాపారులు ఇటు మహారాష్ట్ర ప్రాంతం దేగ్లూర్, సాంగ్లీ తాండూరు ప్రాంత ఇసుక వ్యాపారులు రాత్రి పగలు విచ్చలవిడిగా ఇసుకను తోడేస్తున్నారు అని గ్రామస్తులు తెలిపారు. మొన్న రాత్రి ఇసుక దొంగలు సిర్పూర్ ప్రాంతంలో చెక్పోస్టును సైతం తగలబెట్టడం జరిగింది అని అన్నారు. ఇప్పటికైనా మా గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇసుకను పోతంగల్ గ్రామ ఇసుక మాఫిదారులు మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు దొంగలించకుండా చూడాలని గ్రామస్తులు కోరారు. ప్రతిరోజు రాత్రి పూట అదే విధంగా పగలు కూడా ఇసుక భారీగా తల్లుతుందని దీని గురించి పట్టించుకునే నాధుడు లేరని గ్రామస్తులు ప్రజలు మండిపడుతున్నారు. టిప్పర్లు ఇతర వాహనాల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తుల మునుగు తున్నారని అక్రమ ఇసుక గురించి పట్టించుకునే దాఖలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
