27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మహాజన మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంస్థాగత పునర్నిర్మానంలో భాగంగా మంగళవారం జిల్లా మహిళా సంఘం  నాయకురాలు(మాక్లుర్ మండలం ఇన్చార్జి) గుమ్ముట్టు పద్మ మాదిగ ఆధ్వర్యంలో మాక్లూర్ మండలం ఎమ్మార్పీఎస్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 1- 2024 న ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, ఫిబ్రవరి 7న నిర్వహించే లక్షల డప్పులు వేల గొంతుకల “మహా సభను” విజయవంతం చేయాలని కోరారు.  చలో హైదరాబాద్ కార్యక్రమానికి మాదిగలంతా ప్రతి ఒక్కరు డప్పులతో తరలి రావాలని కోరారు. ఎంఆర్పీఎస్ మండల కమిటీ అధ్యక్షులుగా పంగరి చిరంజీవి, అధికార ఉపాధ్యక్షులుగా కంఠం రమేష్, మగ్గిడి నర్సయ్య మాదిగ, మండల ప్రధాన కార్యదర్శిగా ఊల్లెంగ లక్ష్మణ్, మండల కార్యదర్శిగా నందిగం సంతోష్ మాదిగలను ఎన్నుకున్నారు. ఎంఎస్పీ మండల కమిటీ అధ్యక్షులుగా గుడ్డోళ్ల భాస్కర్ మాదిగ, ఉపాధ్యక్షులుగా నిమ్మల రవి, పెండ ఆనంద్, అక్కనపల్లి రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా దేవుని వల్ల కాశిరమ్, కార్యదర్శిగా: అమ్రాద్ ఒడ్డెన్న, సలహాదారులుగా దరగల సాయిలు, తేడ్డు శేఖర్ , బాబు, ఇందుర్ ఒడ్డేన్న లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జాతీయ నాయకురాలు యమునా, సత్తెక్క,  ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, మహిళా నాయకురాలు సుధా, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article