24 C
Hyderabad
Sunday, August 2, 2026

సివిల్ సప్లై హమాలీల నిరసనకు రేషన్ డీలర్ అసోసియేషన్ మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నాల్గవ రోజు సందర్భంగా శనివారం హమాలీ కార్మికులు అర్దనజ్ఞ ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ నిరసన సమ్మెకు బోధన్ పట్టణ గ్రామీణ రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు భీష్మ గౌడ్, ప్రధాన కార్యదర్శి సనా పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కమిషనర్ వెంటనే ఈ సివిల్ సప్లై కార్మికులకు పెంచిన ధరలను వారి డిమాండ్లను నెరవేరుస్తూ జీవో ఇచ్చి సమ్మెను విరమింప చేయాలని, ఈ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ రేట్ల ఒప్పంద జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఈ నిరసన సమ్మెను మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. నేటి సమ్మె కార్యక్రమానికి మద్దతు తెలిపిన బోధన్ రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ గ్రామీణ రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు భీష్మ గౌడ్, ప్రధాన కార్యదర్శి సనా పటేల్, సభ్యులు నాగనాథ్, రాజు, అజర్ మోహినుద్దీన్ (నాహిద్) సివిల్ సప్లై కార్మికులు బోధన్ పట్టణ ముక్కద్దం వెంకటేష్,  పవన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శంకర్, సుదర్శన్, సాయిలు, పోశెట్టి, లక్ష్మణ్, దేవయ్య, మాణిక్యం, సాయి కృష్ణ, రవికుమార్, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Ration Dealer Association supports civil supply porters' protest

More articles

Latest article