30.9 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా కలెక్టర్ ను కలిసిన బాపూజీ వచనాలయ ప్రతినిధులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును శనివారం బాపూజీ వచనాలయ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసిసి పుష్పగుచ్చమిచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయ కమిటీ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం  మాట్లాడుతూ బాపూజీ వచనాలయాన్ని సందర్శించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను  కోరామని తెలిపారు. తెలంగాణలోని అతిపెద్ద డిజిటల్ లైబ్రరీగా బాపూజీ వచనాలయాన్ని  తీర్చిదిద్దుతున్నామన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా బాపూజీ వచనాలయం వేదికగా నిలబడుతుందన్నారు. ఈ సందర్బంగా ఉర్దూ అకాడమి చేర్మెన్ తాహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం ఎన్నో సంవత్సరాలగా ఈ లైబ్రరీ తోడ్పాటు అందించిందని అన్నారు. విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల బుక్స్ ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే బాపూజీ వచనలయాన్ని సందర్శిస్తానని తెలిపారని అన్నారు. నూతన కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు బీడి.దాస్, సంయుక్త కార్యదర్శి ఏఎస్. సాంబయ్య, సభ్యులు ప్రతాప్ రుద్ర, కోవూరు జగన్,ఆమందు విజయ్, అరేట్టి లక్ష్మి నారాయణ, పాటి అనిల్ రెడ్డి, గోవింద్ ప్రసాద్ జవర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article