24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మాల్తుమ్మెద పాలిటెక్నిక్ కళాశాలను తరలిస్తే పెద్దఎత్తున ధర్నాలు చేపడతాం 

Must read

📰 Generate e-Paper Clip

  •  మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : తెలంగాణ రాష్ట్ర మొదటి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ హాయంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన మాల్ తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను వేరే చోటికి తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం మాజీ ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి హెచ్చరించారు.  శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  గత బారాస ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారు పరిధిలో 25 ఎకరాల్లో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటినుండి కళాశాలలో అన్ని వసతులతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులను సిద్దిపేట జిల్లా తోర్నాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు తరలించినట్లు తెలిసిందన్నారు.  నూతనంగా వచ్చే విద్యార్థులు ఇక్కడ సరైన సదుపాయాలు లేవని, అడ్మిషన్లు రావడం లేదని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు చేరవేసి కళాశాలను ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కళాశాలను తరలించే కుట్రలను భగ్నం చేసి కళాశాల యధావిధిగా కొనసాగే విధంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మాల్ తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట నాగిరెడ్డిపేట్, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల నాయకులతో పాటు విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాల్ తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను నాగిరెడ్డిపేట మండలం నుండి తరలించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article