26.6 C
Hyderabad
Monday, August 3, 2026

సారంగపూర్ లో ఓంటరి మహిళ దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ లో మహిళను గోంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. సారంగపూర్ ఓడ్డేర కాలనీకి చెందిన దుబ్బాక సాయమ్మ (65) ని గుర్తు తెలియని వ్యక్తులు  ఆమే ఇంటిలోనే గురువారం రాత్రి గోంతు కోసి హత్య చేశారు. సాయమ్మ భర్త కాలం చేయగా ముగ్గురు కుతుళ్ల వివాహం చేసింది. ఉన్న ఓక్క కోడుకు ఉపాధి కోసం దుబాయి వెళ్లడంతో సాయమ్మ ఓంటరిగా జీవిస్తుంది. ఓంటరిగా ఉంటున్న సాయమ్మను ఎవ్వరికి హత్య చేయాల్సిన అవసరం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు. సాయమ్మ కుతురు పిర్యాదుతో ఆరవ టౌన్ పోలిసులు కేసు నమోదు చేయగా సంఘటన స్థలాన్ని సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ పరిశీలించి ధర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article