24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మూడు రోజుల్లో రూ.50 కోట్ల మద్యం తాగేశారు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 29,30,31 రెండు రోజుల్లో కలిపి మందుబాబులు జిల్లాలో 49.56 కోట్ల విలువ చేసే మద్యం తాగేసారు. జిల్లా వాసులు 30,31 రెండు రోజుల్లోనే 35 కోట్ల మద్యం సేవించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో మొత్తం 151 వైన్స్ లు,25 బార్లున్నాయి. వీటికి నిజమాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం మాదాపూర్ లోని ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎమ్ఎల్) డిపో నుండి మద్యం సరఫరా అవుతుంది.. నూతన సంవత్సర వేడుకల కోసం డిపో నుండి అర్ధరాత్రి వరకు మద్యం సరఫరా చేశారు. గత సంవత్సరం 2023 డిసెంబర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 28,29,30,31 తేదీల్లో కలిపి 36.43 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా… ఈ సంవత్సరం 2024 లో డిసెంబర్ 28,29,30,31 నాలుగు రోజుల్లో కలిపి సుమరూ రూ.50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే గత సంవత్సరం నూతన వేడుకలతో పోల్చితే ఈ సంవత్సరం వేడుకల్లో రూ.11 కోట్ల మద్యం అధికంగా సేవించారు. మందుబాబులు నిజామాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలతో మద్యం దుకాణాల వారికి కాసుల పంట పండింది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది.

More articles

Latest article