27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలు తప్పవు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్ ఎసిపి శ్రీనివాస్

బోధన్, బతుకమ్మ : ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డివిజన్లోనీ ప్రజలు ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలు తప్పవని బోధన్ ఏసిపి శ్రీనివాస్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు డిసెంబర్ 31 మంగళవారం రాత్రి, జనవరి 1 తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందని, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని డివిజన్లోని ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తేదీన ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాంగ్ సైడ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించరాదని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.

More articles

Latest article