. . . ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
. . . బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం
నిజామాబాద్ సిటీ బతుకమ్మ..
ఎనిమిది దశాబ్ధాల చరిత్ర కలిగిన జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయం ను డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం నాయుడు పేర్కొన్నారు. తమ స్వలాభం కోసం దురుద్దేశంతో బాపూజీ వచనాలయంపై తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసులు వేస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన బాపూజీ వచనాలయాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. బాపూజీ వచనాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డానంటూ కొందరు మీడియా ముఖంగా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజల్లో గందరగోళం తీసుకొస్తున్నారని బాపూజీ వచనాలయం కమిటీ నుండి ఒక్క రూపాయి అయినా వాడుకుని ఉంటే ఆధారాలతో సహా బయటపెట్టాలని అందుకు తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, అంతేకాకుండా చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యలు చేశారు. గత నెల 28న బాపూజి వచనాయలంకు జరిగిన ఎన్నికల్లో రెండు ప్యానెల్లు పోటి పడ్డాయి. ఇందులో మా ప్యానల్ 19 మంది పోటి చేయగా మేము చేసిన అభివృద్దిని చూపి భారీ ఎత్తున గెలిపించారని బాపూజి వచనాలయ చైర్మన్ భక్తవత్సలం నాయుడు (ఢిల్లీ)తెలిపారు.. గత ఐదు సంవత్సరాల క్రితం బాపూజి వచనాలయం సభ్యులు వచనాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీన్ని అభివృద్ది చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపి ఎన్నికల్లో పోటి చేయాలని సూచించారు. వీరి సూచన మేరకు నా ప్యానల్‌లో 14 మంది సభ్యులు పోటి చేసి గెలుపొందారు. ఆ సమయంలో బాపూజి వచనాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మారుస్తామని, నూతన భవన నిర్మాణం చేపడతామని హామి ఇచ్చామని దురద్రష్ట వశాత్తు రెండు సంవత్సరాలు కరోనాతో లైబ్రరీకి రావలసిన అద్దెను సరిగా వసూలు కాలేదని మేము బాధ్యతలు చేపట్టిన సమయంలో రూ. 8లక్షలు ఆర్థిక వనరులు ఉన్నాయని పేర్కొన్నారు.

వచనాయలంలో సరైన వసుతుల లేకపోవడంతో స్త్రీ పురుషులకు వేరువేరుగా అత్యాధునిక అన్ని వస్తువులతో కూడిన బాత్రూమ్స్ ల నిర్మాణం, బాపూజి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల భోజన వసతి కోసం షెడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. డిజిటల్ లైబ్రరీ నిర్మాణం చేయాలంటే దాదాపు రూ.3 కోట్ల వ్యయం అవుతుందని ఆలోచించడం జరిగిందన్నారు. దీని నిర్మాణం కోసం అద్దె రూపంలో రావలసిన బకాయిలు భారీగా పేరుకుపోయాయన్న విషయాన్ని గ్రహించి కమిటీ సభ్యుల సూచన మేరకు మడిగెలో అద్దె ఉంటున్న వారితో సమావేశం జరిపి అద్దె పెంచడం జరిగిందన్నారు. కొందరు అద్దె పెంచేది లేదని బలవంతం చేస్తే కోర్టుకు వెలతామని హెచ్చరించారని గుర్తు చేశారు. బకాయల వసూలుతో దాదాపు రూ.80 లక్షలు జమ అయ్యాయని అన్నారు. భూమి పూజ కార్యక్రమానికి పార్టీలకతీతంగా అందరిని కలుపుకొని భూమి పూజ చేయడం జరిగిందన్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. తమ వద్ద ఉన్న 80 లక్షలతోనే భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిడిందన్నారు. శిథిలావస్తకు చేరిన 22 మండిగెలకు సరిగా అద్దె రావడం లేదని దీన్ని దృస్టిలో ఉంచుకొని వాటిని పడగొట్టి నూతనంగా నిర్మించడం జరిగిందన్నారు. గతంలో ఎంతైతే అద్దె ఇస్తున్నారో వాటిని ప్రస్తుత కాలానికి పెంచి బాపూజి వచనాలయ అభివృద్దికి సహకరించాలని కోరడంతో కోర్టు నుండి నోటీసులు పంపారని తెలిపారు. ఇందులో చదువుకు అభ్యర్థుల్లో దాదాపు 100 మంది ఉద్యోగాలు పొందారని ఇది బాపూజి వచనాలయానికి గర్వకారణం అన్నారు. చందూర్ నుండి సైకిల్‌పై ఒక అభ్యర్థి ప్రతి రోజు వచ్చి చదువుకొని ఉద్యోగం సాధించారని గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న దాదాపు 60 మందికి సన్మానం చేయడం జరిగిందన్నారు. బాపూజి వచనాలయంకు ఎంతో చరిత్ర ఉందని దీని అభివృద్దికి సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
