30.9 C
Hyderabad
Monday, August 3, 2026

దేశ ఆర్థిక సంస్కరణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో కీలకం

Must read

📰 Generate e-Paper Clip

. . ..  సిటీ కాంగ్రెస్ ప్రెసిడేంట్, నుడా  చైర్మన్ కేశవేణు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ..

దేశ ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసిన గొప్ప ఆర్థిక సంస్కర్త సంస్కరణల సారధి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యకుడు, నూడా చైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర ఎంతో కీలకమన్నారు.  అనారోగ్యంతో మృతి చెందిన దివంగత ప్రధాని  మన్మోహన్ సింగ్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు  జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  కేశ వేణు మాట్లాడుతూ రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన మచ్చలేని నాయకుడిగా సుదీర్ఘకాలంగా పనిచేసి క్లిష్ట పరిస్థితులో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని గాలిలో పెట్టిన మహానీయుడు మన్మోహన్ అని అన్నారు. ఆయన భౌతికంగా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లినప్పటికీ ఆయన సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, ఓబిసి అధ్యక్షుడు నరేందర్ గౌడ్,  ఫిషర్ మెన్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మాజీ నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం, నగర మాజీ మేయర్ ఆకుల సుజాత, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సర్దార్ నరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article