28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బైపాస్ లో 30 గుంటల కోసం..

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ స్టేషన్ చేరిన పంచాయితీ
  • పోలీస్ స్టేషన్ లో సెటిల్ మెంట్ కు యత్నం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయితీలకు, సెటిల్ మెంట్లకు కేరాఫ్ అనే విషయం తెల్సిందే. గతంలో పని చేసిన కమిషనర్ హయంలో కాస్తోకూస్తో సివిల్ పంచాయితీల నిర్వాహణ అంటే పోలీసులు భయపడేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే భూమి పంచాయితీని తేల్చేందుకు పంచాయితీ నిర్వహించారు. నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో ఖానాపూర్ చౌరస్తా నుంచి అర్సపల్లి వెళ్లే రోడ్డులో 30 గుంటల భూమి పంచాయితీపై వివాదం నెలకొంది. ఓ వైపున రైస్ మిల్ సంఘం నేత అక్కడ దశాబ్ధం క్రితమే కొనుగోలు చేసిన భూమి డాక్యుమెంట్ తో అక్కడ కబ్జా పెట్టగా దానిపై మాజీ ఎమ్మెల్సీ భర్త సెటిల్ మెంట్ కు దిగాడు. దాదాపు 30 గుంటల భూమి బైపాస్ రోడ్డును ఆనుకుని ఉండగా దాని విలువ రూ.కోట్లలో ఉండడంతో సెటిల్ మెంట్ అనివార్యమైంది. దాని భూమి యజమాని గతంలో రైస్ మిల్ సంఘం నేతకు కొద్దిగా భూమి విక్రయించారు. మిగిలిన భూమి విషయంలో అమ్మకానికి సిద్దపడిన రిజిస్ట్రేషన్ కు మాత్రం వెళ్లలేదు. దాదాపు ధరణి వచ్చినప్పటి నుంచి సంబంధిత భూ రికార్డులు లేవు. దానిని ఆసరాగా తీసుకున్న ఓ రైస్ మిల్ సంఘం జిల్లా నేత ఏకంగా అక్కడ కబ్జాకు దిగాడు. తాను కొనుగోలు చేసిన భూమి ఆనుకుని ఉండడంతో అక్కడ భూమిని చదును చేసి షెడ్డుతో పాటు పార్కింగ్ ఏర్పాటు చేశాడు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంబంధిత భూమి విషయంలో పలు దఫాలు చర్చలు జరిగిన కొలిక్కి రాలేదు. చివరకు మాజీ ఎమ్మెల్సీ భర్త భూ యజమానుల తరపున రంగంలోకి దిగడంతో అసలు భూ యజమాని ఎవరు, కబ్జాదారులు ఎవరు అనే పంచాయితీ తెరపైకి వచ్చింది. దానిని రెవెన్యూ లేదా ల్యాండ్ సర్వే ద్వారా తేల్చుకోవాల్సిన వారు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఇంకేముంది ఓ పోలీసు అధికారి ఆదేశాలతో పోలీస్ స్టేషన్ లోనే ల్యాండ్ సెటిల్ మెంట్ కు సిద్దమైంది. మంగళవారం నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ కు రెండు పార్టీల వారు రావడం అక్కడ ఎవరి వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయన్న పంచాయితీ తెరపైకి వచ్చింది. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అసలు భూ యజమాని వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో భూ వివాదం తేలడం లేదు. ఈసారి అధికార పార్టీ నేత రంగ ప్రవేశం చేయడంతో జిల్లా రైస్ మిల్ సంఘం నేత మధ్య ఉన్న భూ వివాదం కొలిక్కివస్తుందో పోలీసులు సెటిల్ చేస్తారోననే చర్చ జరుగుతుంది.

For 30 potholes in the bypass..

More articles

Latest article