ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
బతుకమ్మ పిట్లం : పాపుల కొరకు లోక రక్షకుడు జన్మించాడని క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరుపుతారని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న చర్చ్ కొరకు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.పిట్లం మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను భక్తులు నిర్వహించారు. అనంతరం ప్రార్థన మందిరంలో రెవెరెండ్ J జయరాజ్ క్రిస్మస్ యొక్క పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు జననం గురించి భక్తులకు వివరించారు. క్రైస్తవ మతము లోకం లో సంతరించి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ ఉన్నారని అన్నారు. ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు ప్రభువును ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థన మందిరాలలో భక్తి శ్రద్ధలతో పూజించారు. యువకులు ప్రత్యేక పాటలు పాడుతూ ఏసుక్రీస్తుని అలరించారు. ఇట్లు మండల వ్యాప్తంగా సిఎస్ఐ చర్చలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ చాటారి బాల్రాజ్, దేవదాస్, జాన్, గడ్డం బాలు, పత్తి బాలరాజ్, గైని రాజ్, భారత్, కారుణకర్, మల్లూరు గంగారం,పత్తి హరీష్,అమ్మగారు రేఖ,మొగులమ్మ, భారతి, మరియమ్మ, భక్తులు పాల్గొన్నారు.

