24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విక్రమ్ హాస్పిటల్ లో వృద్దురాలి మృతి 

Must read

📰 Generate e-Paper Clip

  •  కార్డియాక్ అరెస్ట్ అంటున్న వైద్యులు 
  • చనిపోయిన తర్వాత రిఫర్ చేశారు అంటున్న కుటుంబ సభ్యులు 

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ ; నగరంలోని ఖలీల్ వాడి లోని విక్రమ్ హాస్పిటల్ ఓ వృద్దురాలు మృతి చెందింది. గత 12 రోజుల క్రితం మాణిక్ బండార్ కు చెందిన అమీనా బేగం (70) విక్రమ్ హాస్పిట్ లో చేర్పించగా సోమవారం సాయంత్రం మృతి చెందింది. దమ్ము రావడంతో ఆసుపత్రి లో చెరారు. సోమవారం సాయంత్రం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో విక్రమ్ ఆస్పత్రి వైద్యులు మరో ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్సు లో రిఫర్ చేశారు. అక్కడినుంచి మరో ఆసుపత్రికి వెళ్ళగా అప్పటికే అమీనా బేగం చనిపోయిందని స్థానిక వైద్యులు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్టు ద్వారానే అమీనా బేగం చనిపోయిందని వైద్యులు చెబుతుండగా…. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అమీనా బేగం చనిపోయిన తర్వాతనే రిఫర్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇతర ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లిన అమీనా బేగం  మృతి చెందగా ఆమె డెడ్ బాడీని తీసుకువచ్చి విక్రమ్ హాస్పిటల్ లో తీసుకెళ్లేందుకు ఎక్కించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త  పరిస్థితి నెలకొంది.

Old woman died in Vikram Hospital

More articles

Latest article