25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్యే చెప్తే తప్ప తెలుసుకునే పరిస్థితి లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • నాటడంలో ఉన్న శ్రద్ధ సంరక్షణలు లేదు
  • క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువు

బతుకమ్మ,మోర్తాడ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ప్రతి మొక్కకు జియో ట్యాగ్ చేస్తున్నామని ప్రతి ఒక్క వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని ఒక పక్క అధికారులు గొప్పలు చెబుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో పలు విషయాలు తెలుస్తున్నాయని తెలుపడంలో అతిశయోక్తి లేదు. మోర్తాడ్ మండల కేంద్రంలో దారి విభాగం మధ్యలో సుందరీకరణ, పచ్చదనం కోసం నాటిన చెట్టు ఎండిపోవడం జరిగిందని నియోజకవర్గం ఎమ్మెల్యే చూసి చెప్పే తప్ప తెలుసుకొని పరిస్థితిలో అధికారులు ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు, ప్రజలు తిరిగే ప్రాంతంలో పరిస్థితులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే గ్రామాల్లో నాటిన మొక్కలు ఏ స్థితిలో ఉన్నాయో అర్థం అవుతుందని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనం కోసం 36 శాఖలతో..
పచ్చదనం పెంచడంతో పాటు పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటినారు. జిల్లాలో మొక్కలను రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలతో పాటు, చెరువులు, కాలువ కట్టాలపైనా, ఖాళీ ప్రదేశాలల్లో పెద్ద ఎత్తున ఉద్యమంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశిస్తు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చని ప్రాంతాలుగా నిర్మించాలన్న లక్ష్యంతో 36 శాఖల సిబ్బంది, ఉపాధి కూలీ లతో మొక్కలు నాటినారు. కానీ నాటడం లో ఉన్న శ్రద్ధ సంరక్షణలో లేకుండా పోతుందని తెలుపడంలో సందేహం లేదు.
నిజామాబాద్ జిల్లాలో..
రెండు సంవత్సరాలల్లో 34 లక్షల మొక్కలు ప్లాంటేషన్ ద్వారా నాటినారు. అలాగే 22 లక్షల మొక్కలు హోమ్ సీడ్ రూపంలో పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు.
అలాగే 2024-25 16.30లక్షలమొక్కలు నటినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. నర్సరీలో మొక్కలను పెంచడానికి ఒక మొక్కకు ప్రభుత్వం రూ. 5 చెల్లిస్తుంది. అదే టెకు మొక్క అనుకుంటే రూ. 8 వరకు చెల్లిస్తున్నారు. కమ్యూనిటీ, ప్లాంటేషన్ పద్ధతిలో వన మహోత్సవంలో గుంతను 0.45 సెంటీమీటర్ లోతు, వెడల్పు తవ్వాలి. రహదారుల వెంట 2 ఫీట్ల గుంత తవ్వాలి. ఒక గుంత తవ్వినందుకు రూ.27 అలాగే మొక్క నాటినందుకు రూ. 12 కూలీ లకు చెల్లిస్తున్నారు. నాటిన మొక్కలను సంరక్షించలేక నిర్లక్ష్యం చేయడంతో రూ.లక్షల్లో ప్రజాధనం తన వృథా అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంవత్సరం లక్ష్యం..
నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి 8000 చొప్పున మొక్కలు నర్సరీలో పెంచాలని వన మహోత్సవంలో నాటే విధంగా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామపంచాయతీలో నర్సరీ పనులు నత్తనడకను తలపిస్తున్నాయని పలువూరు వేదన వ్యక్తం చేస్తున్నారు.
మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటాను
సాయగౌడ్ (గ్రామీణ అభివృద్ధి అధికారి) నిజామాబాద్.
మోర్తాడ్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్ పై సుందరీకరణ, పచ్చదనం కోసం నాటిన చెట్లు ఎండిపోయిన విషయం మండల అధికారులతో మాట్లాడతాను. నీటి తడులు అందించడం, సంరక్షణ విషయం, ఎండిపోయిన వాటిలో కొత్తవి నాటించే విధంగా అధికారులతో మాట్లాడి అన్ని విధాలుగా సుందరీకరించే విధంగా చర్యలు తీసుకుంటాను.

There is no way to know unless the MLA tells

More articles

Latest article