28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సులభతరంగా ఛందస్సును బోధించాలి

Must read

📰 Generate e-Paper Clip

యుజిసి కేర్ లిస్ట్ పత్రికా సంపాదకుడు రాంభట్ల పార్వతీశం శర్మ

నిజామాబాద్, బతుకమ్మ : విద్యార్థులలో ఛందస్సు పట్ల భయాన్ని తొలగించి సులభతరంగా ఛందస్సును బోధించడం ద్వారా వాళ్లు కూడా మంచి పద్యాలను రాయగలుగుతారని, తద్వారా ప్రాచీన కావ్యాలను వ్యాఖ్యానించగలుగుతారని ప్రముఖ అవధాని విమర్శకుడు ఔచిత్యం యుజిసి కేర్ లిస్ట్ పత్రికా సంపాదకుడు రాంభట్ల పార్వతీశం శర్మ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం,  భారతీయ భాష సంరక్షక కేంద్రం  ఆధ్వర్యంలో శనివారం  పునఃశ్చరణ నాలుగవ రోజు తరగతులు నిర్వహించారు.  ప్రముఖ అవధాని విమర్శకుడు ఔచిత్యం యుజిసి కేర్ లిస్ట్ పత్రికా సంపాదకుడు రాంభట్ల పార్వతీశం శర్మ”ఛందస్సు వినూత్న బోధనా పద్ధతులు “అనే అంశం పైన మాట్లాడారు.  దేశీ మార్గ ఛందస్సు మధ్య భేదాలను స్పష్టంగా తెలియజేశారు. ద్విపద పదాలను మార్గ చెందస్సులో నన్నయ్య గారు రాసిన వృత్త పద్యాలను దేశీ చందస్సులో పాల్కురికి సోమన రాసిన ద్విపద పద్యాల మధ్య ఉన్న భేదాలను గుర్తించాలాన్నాడు. ఒక పద్యంలోని గుర్తించినప్పుడే ఆ పద్య బోధన సరిగ్గా చేయగలుగుతామన్నారు. ప్రముఖ కథా రచయిత, విమర్శకుడు కె.పి అశోక్ కుమార్  నవల రచన పద్ధతులను గురించి ప్రసంగించారు. తొలితరం లో తొలి తరంలో వచ్చిన నవల పరిణామ పద్ధతులను వివరించాడు.  మాదిరెడ్డి సులోచన , పోల్కంపల్లి శాంతాదేవి యుద్ధనపుడి సులోచన యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖ రచయితల నవలలను చదివి ఆ నవలలో ఉన్న సాంఘిక నేపథ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు సమాజం అర్థం అవుతుందని చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ అడవి బాపిరాజు ముదిగొండ శివప్రసాద్ వంటి ప్రముఖ రచయితల నవలలు చదివి ఆ నవల సారాంశాన్ని విద్యార్థులకు వివరించాల వివరించాలని అధ్యాపకులకు సూచించారు. వారి  నవలలను  విద్యార్థులకు వివరించి విశ్లేషించి చెప్పినట్లయితే వాళ్ల చుట్టుపక్కల జరుగుతున్న అంశాల పట్ల వాళ్లు ప్రేరణ పొంది మంచి నవలలను తీసుకొస్తారని తెలియజేశారు.

Prosody should be taught easily

More articles

Latest article