. . . అల్వాల్ రిలేనిరాహార దీక్షలో కామారెడ్డి ఉద్యమకారులు
జుక్కల్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసి తెలంగాణ స్వరాష్ట్రా సాధనలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆల్వాల్ రిలే నిరాహార దీక్షలో కామారెడ్డి జిల్లాలోని ఆయా మండలా లకు చెందిన ఉద్యమకారులు పాల్గొన్నారు. జుక్కల్ మండలంలోని పెద్దహెడ్గి గ్రామానికి టియుఎఫ్ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సభ్యుడు కౌవూరువార్ బస్వరాజ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్తా, బాన్స్ వాడ మండల కార్యదర్శి దమ్మణపేట భాస్కర్ గౌడ్ తోపాటు తెలంగాణ ఉద్యమకారులు సంజీవ్ రెడ్డి, సత్యనారాయణ, పి. బస్వరాజ్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకోవాలని, ఉద్యమకారు లందరికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, 250గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి ఆర్థిక సహాయం, ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఉచిత భీమ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హామీలు నెరేవేర్చే వరకు నిరాహారదీక్షలు కొనసాగిస్తామన్నారు.
