27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

మండల దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ గడాల ప్రసాద్ 

భీమ్ గల్, బతుకమ్మ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి  అమిత్ షా బేషరత్ గా క్షేమపణ చెప్పాలని భీమ్ గల్ మండల దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ గడాల ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో బస్సు స్టాండ్ నుండి బడా భీమ్ గల్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అయన  మాట్లాడుతూ విశ్వమంతా అంబేద్కర్ ను కీర్తిస్తుంటే, కేంద్రంలో భాద్యత గల మంత్రిగా ఉండి అనుచితంగా మాట్లాడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే అమిత్ షా క్షేమపణ చెప్పక పోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, నిరసనలు, దిష్టి బొమ్మ దహనలు కొనసాగుతూనే ఉంటాయాని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో దళిత సంఘం నాయకులు రాజేందర్, సీను, సునీల్, జె జె నర్సయ్య, పర్స అనంత్ రావు, రమేష్, రతన్, అనిల్, గంగాధర్, దళిత సంఘాల నాయకులు, సభ్యులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article