30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అహంకారి అమిత్షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 నూడ చైర్మన్ కేశ వేణు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  పార్లమెంట్ సాక్షిగా దేశ రాజ్యాంగాన్ని రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అహంకారి దేశ హోం మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని నూడా చైర్మన్ కేశ వేణు డిమాండ్ చేశారు. దేశానికి పట్టుకున్న ఇద్దరు అహంకారులుఒకరు ప్రధాని నరేంద్ర మోడీ అయితే, మరొకరు హోం మంత్రి అమిత్ షా అని అన్నారు.  దేశంలోని పౌరులందరూ సమాన హక్కులతో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానాన్ని రచిస్తే అది తెలియని కేంద్ర హోం మంత్రి అంబేద్కర్ పట్ల అనుచితంగా కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నగరంలోని పూలాంగ్ చౌరస్తా లోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గౌడ్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికిపాలభిషేకం చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు మరల పునరావృతమైతే బిజెపి  ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, మాజీ కార్పొరేటర్ రాజేష్ జిల్లా ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు వేణు రాజు తదితరులు పాల్గొన్నారు.

Arrogant Amitsha should be sacked from the cabinet

More articles

Latest article