బతుకమ్మ, మోర్తాడ్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని మోర్తాడ్ మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అంగుళి మాల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్, అంబేద్కర్ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారింది…దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే.. స్వర్గానికి వెళ్లొచ్చని సాక్షాత్తు పార్లమెంట్ లో అమిత్ షా అనడం బాధాకరమన్నారు. దేశంలోనే ఉన్నతమైన పదవుల్లో ఉండి డా.అంబేద్కర్ ను అవమానించడం సరికాదన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ను అవమానించే హక్కు నీకు లేదని, అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే ఈ రోజు పార్లమెంట్లో ఉన్నతమైన పదవి అనుభవిస్తున్నావని తెలిపారు. ఆ మహానుభావులు పేట్టిన బిక్షాను మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.
