24 C
Hyderabad
Sunday, August 2, 2026

తెరపైకి నీటి సంఘాలు..

Must read

📰 Generate e-Paper Clip

  • మళ్లీ ఆదర్శ రైతుల నియామకం
  •  వెయ్యి ఎకరాలకు ఒక ఎఈఓ
  • వ్యవసాయం చేసే రైతు సమస్యల పరిష్కార వేదిక
  • మీడియాతో రాష్ట్ర అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతుల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు ఆవకాశం ఉండేదని తెలంగాణ వచ్చిన తరువాత వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి వ్యవస్థ లేదని సీయం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని దానిలో తనను సభ్యులుగా నియమించినంధుకు గడుగు గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో తన నివాసంలో విలేఖరుల సమావేశంలో గడుగు గంగాధర్ మాట్లాడుతు… వ్యవసాయం, సాగునీరు, విత్తనాలు, ఫర్టిలైజర్స్, గోదాములు, రైసు మిల్లులు, సోసైటీల ద్వార రైతులకు ఎలాంటి సమస్యలనైన పరిష్కరించేందుకు రాష్ట్ర అగ్రి కల్చర్ ఫార్మర్స్ వెల్పేర్ కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ జరుగని రైతులు ఈ విషయంను కమీషన్ కు ఫిర్యాదు చేస్తే దానిని పరిష్కరిస్తాం అన్నారు. లగ చర్లలో రైతుల ముసుగులో జిల్లా కలెక్టర్ పై దాడి చేసిన వారిపట్ల ప్రభుత్వం కఠినంగా ఉందన్నారు. తెలంగాణ లో గతంలో మాదిరిగా రైతులకు సాగు నీటి కష్టాలను తీర్చేందుకు సాగునీటి సంఘాలను పునరుద్ధరించే ఆలొచన చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతు సమన్వయ సమితిలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారాయని అందుకే మళ్లీ ఆదర్శ రైతులను నియమిస్తామని అన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించే సంబంధిత వ్యవస్థలోని అధికారులపై కమీషన్ కు పూర్తి అధికారాలు ఉంటాయని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక ఏఇఓలను నియమించే ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. రైతులకు జరిగే కష్ట నష్టాల ను గుర్చి కమీషన్ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని స్టేట్ అగ్రికల్చర్ అండ్ ఫర్మర్స్ వెల్పేర్ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ అన్నారు.

Water communities on the screen..

More articles

Latest article