27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశాం

Must read

📰 Generate e-Paper Clip

. శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలిలో సోమవారం ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు ఉండగా, ప్రత్యేక తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వా వాటి సంఖ్యను 275కు పెంచిందని, 31 డిగ్రీ బీసీ కళాశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే అగ్రికల్చర్ బీసీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.  రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ అందించగా, 15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయలేక పోవడం బాధాకరమని, విదేశీ విద్యకు ఎలాంటి ప్రోత్సహకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో మెనూ మార్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కానీ స్కూళ్లలో ఇంకా ప్రారంభం కాలేదని, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలని అన్నారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని, ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారని, వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉంటున్న రాష్ర్ట ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు ఎంత తీసుకొచ్చారని ప్రశ్నించారు.

More articles

Latest article