24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఏటీఎంలో విత్ డ్రా కొట్టి డబ్బులు మర్చిపోయిన వ్యక్తి

Must read

📰 Generate e-Paper Clip

లింగంపేట్, బతుకమ్మ: లింగంపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసిన వ్యక్తి వాటిని తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఉదయం 11.30 గంటల తరువాత అదే ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి డబ్బులను గమనించి పక్కనే ఉన్న ట్రాక్టర్ షోరూం వారిని పిలిచి విషయం చెప్పాడు. వారు వచ్చి లెక్కించగా రూ.10వేలు ఉన్నట్లు తెలిసింది. ఆ డబ్బులు ప్రస్తుతం ట్రాక్టర్ షోరూం వారి వద్ద ఉన్నాయని, డబ్బులు మర్చిపోయిన వారు తీసుకెళ్లాలని సదరు వ్యక్తి  సూచించారు.

More articles

Latest article