29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణి

Must read

📰 Generate e-Paper Clip

  • వినూత్న గా సెర్ఫ్ సీఈఓ జన్మదిన వేడుకలు
  • సీఈఓ ఆశయాలకు అనుగుణంగానే జన్మదిన వేడుకలు

బీమ్ గల్, బతుకమ్మ : అనునిత్యం పేద మహిళా సంక్షేమం కోరే స్టేట్ సెర్ఫ్ సీఈఓ దివ్య ఐఏఎస్ జన్మదిన వేడుకులను సెర్ఫ్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ కుంట గంగాధర్ ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి మండల సెర్ఫ్ ఎంప్లాయిస్ వినూత్నంగా జరుపుకొన్నారు.పుట్టినరోజు పండగ అనగానే కేకులు, బొకేలు, పూలదండాలు అనే హంగామా చేయకుండా, డబ్బు వృధా చేయకుండా నిరాడంబరంగా సీఈఓ బర్త్ డే ను నిర్వహించారు. కృత్రిమంగా తయారు చేసే కేకులు తినడం మూలాన ఆరోగ్యానికి హాని జరుగుతుందన్న డాక్టర్ల సూచనను దృష్టిలో ఉంచుకొని, ప్రతి పైసా పేదలకు సంక్షేమంకు ఉపయోగించాలన్న దివ్య ఐఏయస్ ఆలోచనకు అనుగుణంగా ఆమె జన్మదిననా పలువురు పేదలకు సెర్ఫ్ ఉద్యోగులు నిత్యావసర సరుకులు బియ్యం, పప్పులు, సబ్బులు ఇతరత్ర వస్తువులను అందజేశారు. ఈ సందర్బంగా స్టేట్ సెర్ఫ్ ప్రెసిడెంట్ గంగాధర్ మాట్లాడుతూ సీఈఓ ప్రతి క్షణం పేద మహిళా సంక్షేమమే కోరుతుందని అన్నారు. ఎప్పుడైనా సీఈఓ పూలదండాలు, బొకేలు, శాలువాలు, సన్మానాలను తిరస్కరిస్తారని తెలిపారు. ఆమెకు ఆడంబరాలకు దూరంగా ప్రజలకు మేలు చేయాలన్న తపనతో ఉద్యోగం చేస్తారని అన్నారు. అలాంటి ఉన్నతాధికారి దగ్గర పని చేయడం మా సెర్ఫ్ ఉద్యోగుల అదృష్టమని ఆయన కొనియాడారు. అందుకే ఆమె ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆమె జన్మదిన వేడుకలను జర్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి సీసీ లు రవికుమార్, అలేఖ్య, వీఓఏ లు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article