27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాదయాత్రగా శబరిమలకు చేరిన మాలధారులు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామం నుంచి పాదయాత్రగా శబరిమలకు బయల్దేరిన ఐదుగురు అయ్యప్ప మాలధారులు స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. గురుస్వామి ప్రసూన్ స్వామి, అనిల్ స్వామి, రాజు స్వామి, గాండ్ల సుభాష్ స్వామి, జువ్వల శ్రావణ్ స్వాము అక్టోబర్ 28న కాలి నడకన బయలుదేరి కేరళలోని శబరిమల చేరుకున్నారు. 41 రోజులపాటు 1400 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. వైపు వర్షం, మరో వైపు చలితో కొండల్లో పాదయాత్ర కొనసాగిందని వారు తెలిపారు. తాము శబరిమలకు పాదయాత్రగా వెళ్లడం రెండోసారని గురుస్వామి ప్రసూన్ స్వామి, అనిల్ స్వామి తెలిపారు.

More articles

Latest article