27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు గో రక్ష మహాపాదయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: గోరక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ కోసం అఖిల భారత గో సేవ ఫౌండేషన్ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ  గురుస్వామి తన బృందంతో కాశీ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర 12వ తేదీన నిజామాబాద్ నగరానికి చేరుకుంటుందని కార్యక్రమ సమన్వయ కార్యకర్త మరాఠా సంతోష్ కుమార్ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  గురువారం ఉదయం 9గంటల నుంచి నీలకంఠేశ్వరాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని, రైల్వే స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు శోభాయాత్ర కొనసాగుతుందని, గోభక్తులు, అయ్యప్ప భక్తులు, హిందూ బంధువులు తరలిరావాలని కోరారు. గంగాస్థాన్ లోని ఉత్తర తిరుపతి క్షేత్రం వద్ద భారీ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వీరమల్లు సంతోష్, రవీందర్, లాభిశెట్టి శ్రీనివాస్, పాండురంగారావు, కోటగిరి శ్రీనివాస్, దీకొండ దేవేందర్, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article