27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని కోరుకుంటున్నాం అన్నారు. అనంతరం నియోజకవర్గ నాయకులు వైశ్రీ మాట్లాడుతూ సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఎన్ డి సి సి బి డైరెక్టర్ మోత్కు భూమన్న, నియోజకవర్గ నాయకులు వైశ్రీ, జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీధ్, రంజిత్,మాజీ సర్పంచులు ధోన్ పాల్ పర్స దేవన్న, డోన్కాల్ కత్తి ముత్తన్న, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇంతియాజ్ సల్మాన్, కాంగ్రెస్ పార్టీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మనోజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్, మైనారిటీ నాయకులు నసీర్, డోన్కల్ అధ్యక్షుడు అనిల్, వడ్యాట్ అధ్యక్షుడు నవీన్, తిమ్మాపూర్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, సీనియర్ నాయకులు కడపటి రమేష్, నాగభూషణం, తక్కూరి సతీష్, ఏనుగు మోహన్, జమాల్, పెండం శ్రీను, శెట్పల్లి నవీన్, శివారెడ్డి శంకర్, ఎల్లాల రాజేశ్వర్, అర్షద్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article