ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

బతుకమ్మ,మోర్తాడ్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని కోరుకుంటున్నాం అన్నారు. అనంతరం...