28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

 విహారం విజ్ఞాన దోహదం

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ,ఏర్గట్ల:  పాఠ్యపుస్తకాల్లో నేర్పిన అంశాలు కళ్లెదుట కనిపిస్తే పిల్లల మనోఫలకంపై చెరగని ముద్ర పడుతుంది. పాఠశాల విద్యా దశలో విజ్ఞానం పెంపునకి ఎంతో ఉపయోగపడతాయని నిపుణుల విశ్లేషణ. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం అమల్లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి నేతృత్వంలో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 9,10 వ తరగతి చదువుతున్న దాదాపు 100 మంది విద్యార్థులు  ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం,లక్నవరం సరస్సు, వరంగల్ లోని వేయి స్తంభాల గుడి ,భద్రకాళి దేవాలయం ని దర్శించారు. వీరిని శనివారం పలకరించినప్పుడు తమ యాత్ర అధ్యంతం ఉల్లాసం ఉత్సాహంతో కొనసాగిందని,  ఇలాంటి విహారయాత్రలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, తెలియని జ్ఞాన సంపద తెలుసుకోవడానికి ఎంతో తోడ్పడతాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు మునీరుద్దీన్ ,రాజనర్సయ్య, రాజేందర్, విజయ్ కుమార్, ఎస్. శ్రీనివాస్ ,గంగాధర్, ప్రవీణ్ శర్మ, జ్యోతి, కే. శ్రీనివాస్, సబిత, నరేష్, గంగ మోహన్, ట్వింకిల్,  హరి ఉన్నారు.

More articles

Latest article