విహారం విజ్ఞాన దోహదం
బతుకమ్మ,ఏర్గట్ల: పాఠ్యపుస్తకాల్లో నేర్పిన అంశాలు కళ్లెదుట కనిపిస్తే పిల్లల మనోఫలకంపై చెరగని ముద్ర పడుతుంది. పాఠశాల విద్యా దశలో విజ్ఞానం పెంపునకి ఎంతో ఉపయోగపడతాయని నిపుణుల విశ్లేషణ. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం అమల్లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి నేతృత్వంలో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 9,10 వ తరగతి చదువుతున్న దాదాపు 100 మంది విద్యార్థులు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం,లక్నవరం సరస్సు, వరంగల్ లోని వేయి స్తంభాల గుడి ,భద్రకాళి దేవాలయం ని దర్శించారు. వీరిని...