30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ గురుకులాలు అధోగతి 

Must read

📰 Generate e-Paper Clip

విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు బిఆర్ఎస్ ప్రత్యక్ష కార్యాచరణ

బీఆర్ఎస్వి విభాగం గురుకుల బాట సందర్శన కమిటీ జిల్లా ఇన్చార్జ్ సాయి తేజ

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ గురుకులాల పరిస్థితి అధోగతి పాలైందని బీఆర్ఎస్వి విభాగం గురుకుల బాట సందర్శన కమిటీ జిల్లా ఇన్చార్జ్ సాయి తేజ అన్నారు.  రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఇకపై బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకై ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్వి విభాగం గురుకుల బాట సందర్శన కమిటీ జిల్లా ఇన్చార్జ్ సాయి తేజ పేర్కొన్నారు. ఆదివారంజిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన గురుకుల బాట సందర్శన కమిటీ బృందం ప్రతి గురుకుల ప్రభుత్వ హాస్టల్లో పరిస్థితిని సమీక్షించనున్నామని తెలిపారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఫోటోలు తీసి తమ పార్టీ అధిష్టానం దృష్టికి తమ కమిటీ తీసుకెళ్తుందని పేర్కొన్నారు. దాని ద్వారా పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. గత సంవత్సర కాలంగా విద్యార్థి విభాగాన్ని, విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆయన అన్నారు. ఉడికి ఉడకని బియ్యం, పురుగులతో కూడిన పప్పు నీళ్లతో విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్లో భోజనాలు పెడుతున్నారని, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ హయాంలో గురుకలాలను ప్రవేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన చదువుతోపాటు పౌష్టికాహారం అందించామని తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో  మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు  తదితరులు పాల్గొన్నారు.

During the one year rule of the Congress, the government gurukulas have deteriorated

More articles

Latest article