- ఇచ్చిన హామీలన్ని ఒక్కక్కటిగా అమలు చేస్తాం
భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రైతు ఋణ మాఫీని చేసిందని అందులో భాగంగా మిగిలిపోయిన రైతులకు త్వరలో ఋణ మాఫీ చేయడం జరుగుతుందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ లు అన్నారు. శుక్రవారం భీమ్ గల్ పట్టణం లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి వారు వివరిస్తూ బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ ఓడిపోయిన ఎన్నికల సమయంలో చెప్పినట్టు నియోజకవర్గంలో గంజాయి ని ఉక్కు పాదంతో అణిచివేసామని తెలిపారు. ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పై చర్చించి సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే మెజారిటీ రైతులకు రుణమాఫీ అయిందని, మిగిలిన రైతులకు త్వరలోనే మాఫీ అవుతుందని అన్నారు. వరి పంటకు రూ.500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించిందని,దీనివల్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా, వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ద్వారా, 500 కి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మహిళలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా తమ భావవ్యక్తీకరణను తెలుపుతున్నారని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్చార్జులు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల సమస్యలను పరిష్కరించే మార్గం సులువుతుందని తెలిపారు. భీంగల్ మున్సిపాలిటీని అభివృద్ధి చెసే బాధ్యత తీసుకుంటానని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

