27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులు క్షణికావేశాలకు లోను కాకూడదు

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ పిట్లం : మత్తు పదార్థాల జోలికి అసలు వెళ్లకూడదు.మొబైల్ ఫోన్లకు బానిసలు కాకూడదనీ జిల్లా మానసిక వైద్యుడు జి రమణ అన్నారు.పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ జీ రమణ శుక్రవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  ఆధ్వర్యంలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల పిట్లం యందు మానసిక ఆరోగ్య కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రోహిత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జి. రమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, తక్కువ మార్కులు వస్తున్నాయని, సమాజంలో అవహేళనకు గురవుతున్నామని  క్షణికావేశాలకు లోనయ్యి ఆత్మహత్యలు చేసుకోవద్దని భవిష్యత్తులో చాలా రకాల అవకాశాలు ఉంటాయని అందుకు తగు విధంగా మానసిక పరిపక్వతతో తయారవ్వాలి సూచించారు. అంతేకాకుండా ఈ వయసులో మత్తుపదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదని, మొబైల్ ఫోన్ వినియోగం ఎక్కువగా చేయకూడదని, అవసరమైనంత మేరకు మాత్రమే మొబైల్ వాడకం జరపాలని కానీ వాటికి బానిస కావద్దని తెలిపారు.ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న క్రమంలో జరిపిన సర్వేల్లో ఇవే విషయాలు స్పష్టం చేశాయని ఈ యుక్త వయస్సులో ప్రేమలకు సైతం తావివ్వొద్దని అవి ఆకర్షణ మాత్రమేనని, ఈ వయస్సులో వచ్చే కొద్దిపాటి ఆలోచనలు మాత్రమేనని, ఆ ఆలోచనలను పక్కకు పెడుతూ చదువుపై దృష్టి పెట్టి లక్ష్యానికి చేరువ కావాలని అన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు చెప్పిన మాటలను వినాలని మానసిక అనారోగ్యానికి గురి కావద్దని తెలిపారు. అలాగే ఎవరికైనా మానసిక ఆందోళనకు గురవుతే నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ 14416కి కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకుంటూ మానసిక ఆరోగ్యం పై దృఢత్వాన్ని పెంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ డాక్టర్ రాహుల్ కుమార్, అధ్యాపకులు నరేష్, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article