30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదు.. భస్మాసుర హస్తం

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
  • నగరంలో ర్యాలీ నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదని.. భస్మాసుర హస్తం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ఆరు అబద్దాలు.. అరవై ఆరు మోసాలకు నిరసనగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.  అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ఎమ్మెల్యే  మాట్లాడుతు.. గత ప్రభుత్వం బీ ఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు గోస పడి మార్పు కోసం అని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే అధికారం లోకి రాగానే 100 రోజుల్లో అమలు చేస్తానన్న గ్యారంటీలు, హామీలు ఏడాది పాలన పూర్తి అవుతున్న ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి, నియంతల వ్యవహరించి దశాబ్ది ఉత్సవాలు జరిపితేనే ప్రజలు తగిన బుద్ది చెప్పి ఫామ్ హౌస్  కి పరిమితం చేశారని అన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పోయినోడి జుట్లనుండి తెలిండని ఏడాదికే విజయోత్సవాలు అని ప్రజాధనం వృధా చేయడం మొదలు పెట్టిండు అన్నారు. దశబ్ది ఉత్సవాలకు సారూను, కారును ఇంటికి పంపిన ప్రజలు , ఈ విజయోత్సవాలకు రేవంత్ ను హస్తం పార్టీని బొంద పెట్టడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న హిందూ దేవుళ్ళ పై ప్రమాణం చేసి ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలలో  100 రోజుల్లో అమలు చేస్తానన్నా గ్యారంటీలు, హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని,ఏడాది పాలన తెలంగాణ భవితవ్యం అంధకారంలో నెట్టపడిందని అన్నారు. విజయోత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారో , ఏ వర్గం ప్రజలు ఉత్సవాలలో పాల్గొనాలో …? ప్రజా ధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల కింద కాంగ్రెస్ మోసాలకు నిరసనగా  28 రోజుల విజయోత్సవాలకు 28 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాస్తే ముఖ్యమంత్రి సమాధానం లేదని కాని ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల పాయంట్లు తడుస్తున్నాయన్నారు. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ వస్తాడో.. ఇంచార్జ్ మంత్రి వస్తాడో చర్చకు రమ్మని ఎమ్మెల్యే గా తాను కాంగ్రెస్ ఏడాది పాలన 6 అబద్దాలు 66 మోసాలను బయట పెట్టడానికి సిద్ధం ఉన్నానని సవాల్ విసిరాడు. అర్బన్ ఎమ్మెల్యే గా ఉన్నన్ని రోజులు  కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలు  సాగవు, సాగనివ్వను అని హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధికి తను ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని దానికోసమే నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సహాయ, సహకారంతోనే రాబోయే రోజుల్లో ఇందూర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం గల్లీ నుండి ఢిల్లీ వరకు అయోమయంలో పడ్డారని ప్రధాని మోదీ  నాయకత్వంలో బిజెపి హావాకు హస్తం నేతలు ఆగం అయితుండ్రు అని దానికి మొన్న జరిగిన మహారాష్ట్రలో ఎన్నికలే ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆపన్న హస్తం కాదు అని, అది భస్మాసుర హస్తం అని అన్నారు. ఈ విషయమై రాష్ట్రంలో ప్రజలు విషయం తెలుసుకుంటుండ్రు అని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో బొంద పెట్టడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పాలన పై దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. లేదంటే కెసిఆర్ కి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్పొరేటర్లు, బీ జే వై ఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

The hand of Congress is not the hand of Bhasmasura

More articles

Latest article