30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీసులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్స్, టీఏ , డీఏలు వెంటనే చెల్లించాలి
  • ప్రభుత్వ విరమణ పొందిన ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం బకాయి పడింది
  • అసెంబ్లీ అయ్యే లోపు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
  • కామారెడ్డి శాసన సభ్యులు, బీజేపీఎల్పీ ఉప నేత కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, బతుకమ్మ :  ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కామారెడ్డి శాసన సభ్యులు, బీజేపీఎల్పీ ఉప నేత కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రిటైర్డు ఉద్యోగుల  సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ఉద్దేర మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలకు దోకా ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమండ్ చేశారు. పోలీసులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్స్, టీఏ, డీఏ లు వెంటనే చెల్లించాలని అన్నారు. చివరికి ఏళ్ళ తరబడి ప్రజా సేవ చేసి పదవి విరమణ పొందిన ప్రభుత్వ విశ్రాంత  ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు. ఏడాది కాలంగా రైతులను, విద్యార్థులను, జర్నలిస్టులను, మహిళలనే కాదు చివరికి ఉద్యోగస్తులను కూడా రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తు వస్తుందని అన్నారు. ఈ అసెంబ్లీ అయ్యే లోపు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

Dues due to government employees should be paid promptly

More articles

Latest article