28.2 C
Hyderabad

అదనపు డిసిపి (అడ్మిన్)గా జి.బస్వారెడ్డి బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  ఇటీవల పదోన్నతి పొందిన గట్టు బస్వారెడ్డి అదనపు డీసీపీ(అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించారు.  శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) గా జి.బస్వారెడ్డి కోటేశ్వర రావు నుండి బాధ్యతలు స్వీకరించారు. కోటేశ్వరరావును హైదరాబాద్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. బస్వారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐగా పలు పోలీస్ స్టేషన్ లలో పని చేశారు. ఇటీవల ఆర్మూర్ ఏసీసీగా పనిచేసి అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే.

More articles

Latest article