27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

వరంగల్ ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ అశోక్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని వరంగల్ ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఎమ్మార్టీ ల్యాబ్ లో సెమీ ఆటోమెటిక్ మీటర్ టెస్ట్ బెంచ్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టును రూ.37లక్షలతో నిర్మించారని తెలిపారు. దీంతో మన ఇంటి మీటర్స్ సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ అన్ని కూడా ఈ టెస్ట్ బెంచ్ పై టెస్ట్ చేసి అత్యంత ప్రామాణికంగా టెస్టింగ్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఇప్పుడు మన జిల్లాలో మీటర్స్ టెస్టింగ్ కచ్చితత్వంగా ఉండే విధంగా చేయడం జరుగుతుందని తెలిపారు. దీంతో వినియోగదారులు మీటర్స్ ప్రాబ్లం ఉంటే టెస్టింగ్ ఈ బెంచ్ పై చేయడం జరుగుతుందని  పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ ఎస్సీ ఆపరేషన్ రాపల్లి రవీందర్, టెక్నికల్ రమేష్ డి ఈ ఎం ఆర్ టి వెంకటరమణ, డీఈలు జాడే ఉత్తమ్, ఎండి ముక్తార్, ఏడీఈ సిటీ మీటర్ నీలిమ, ఎల్టీ మీటర్ ఏఈ  మౌనిక రెడ్డి ,ఏడీ ఈ లు వరప్రసాద్, నటరాజ్ తోట రాజశేఖర్, ఏ ఇ లు దుర్గాప్రసాద్, నవీన్ రెడ్డి, భాస్కర్ ప్రసాద్,గయాస్ హైమత్ ఎంఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Better services should be provided to the customers

More articles

Latest article