26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

– శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

-బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

బతుకమ్మ, కమ్మర్ పల్లీ: ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం లో ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రైతు,మహిళా సదస్సును నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి వారు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ రైతులకు ఏకకాలంలో 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశామని మిగిలిన రుణాలను ఈ ప్రజా ప్రభుత్వం త్వరలోనే మాఫీ చేస్తుందని అన్నారు. ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పై చర్చించి సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే మెజారిటీ రైతులకు రుణమాఫీ అయిందని మిగిలిన రైతులకు త్వరలోనే మాఫీ అవుతుందన్నారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని దీనివల్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ద్వారా, 500 కి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మహిళలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అన్నారు.ప్రజా ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఇన్చార్జులు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల సమస్యలను పరిష్కరించే మార్గం సులువుతుందన్నారు.
రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

People live freely in public government

More articles

Latest article