29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

విద్యా కమిషన్ సభ్యురాలు కందాడి జ్యోత్స్న శివారెడ్డి

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర విద్యా మిషన్ సభ్యురాలు కందాడి జోత్స్న శివారెడ్డి సందర్శించారు. సి ఎస్ శాంతి కుమారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాలయాలను సందర్శించడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యాలయ ప్రిన్సిపల్ కు సూచించారు.మధ్యాహ్న భోజనాన్ని,వంట శాలను,  బియ్యాన్ని,పప్పులను, కూరగాయలను వంట సామాగ్రి  యొక్క నాణ్యతను పరిశీలించారు. విద్యార్ధులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.డిసెంబర్‌ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో కమిషన్‌ పర్యటనకు సహకరించడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పా టు పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు  ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

More articles

Latest article