27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి 

Must read

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్, బతుకమ్మ:  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తుందని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.మంగళవారం బోధన్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్మించవలసిన సమీకృత రెసిడెన్షియల్ విద్యాసంస్థలు వసతి గృహ సముదాయం కోసం బెల్లాల్ గ్రామ సమీపంలోని మధుమ లాంచ డిగ్రీ కళాశాల స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం శిథిలావస్థలకు చేరిన ప్రభుత్వ గిరిజన పాలర వసతి గృహాన్ని పరిశీలించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో   డిసిహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి  15 లక్షల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యాధికారులతో సమావేశమై ఆస్పత్రిలో వైద్యుల ఖాళీలు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు ఖాళీగా ఉన్న డాక్టర్లు స్టాప్ నర్సుల పోస్టులను వెంటనే పార్టీ అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. శిథిలవస్థలకు చేరిన బోధన్ మున్సిపల్కార్యాలయ భవనం స్థలంలోనే త్వరలోనేనాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.రైతులకు ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిందని అన్నారు.వరి పంటకు మద్దతు ధరతో పాటు సన్నలకు 500 రూపాయల బోనస్ చెల్లించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  సంధ్య దాము, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏసిపి శ్రీనివాస్, టిపిసిసి డెలిగేట్ గంగా శంకర్, తహసిల్దార్ విటల్, ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపీ ఓ మధుకర్, కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి,శరత్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Work for the upliftment of all communities

More articles

Latest article