27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రెంజర్లలో పర్యటించిన సునీల్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కాల్: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మండలంలోని రెంజర్ల గ్రామంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో చేపట్టే డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణ దశ పనులను పర్యవేక్షించారు. గ్రామంలోని సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తొందరగా పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మగ్గిడి ముత్యం రెడ్డి, డీసీసీ డెలిగేట్ ఉపాధ్యక్షుడు గడ్డం చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

More articles

Latest article