బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడ మండలంలోని బోర్లం మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఏఎన్ఎం లేక ఇబ్బందులు వస్తున్నాయని మాజీ వార్డు మెంబర్ అక్బర్, మైనార్టీలు ఖాదర్, రహీం, నిజాముద్దీన్ తెలిపారు. ఈ మేరకు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఐదు నెలల క్రితం అనారోగ్యానికి గురై ఓ బాలిక మృతి చెందిందన్నారు. ఆర్నెళ్లుగా తెలుగు పోస్టు ఖాళీగా ఉండడంతో విద్యార్థినులు సబ్జెక్టులో వెనుకబడిపోతున్నారన్నారు.