29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జల విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టండి

Must read

📰 Generate e-Paper Clip

చీఫ్ ఇంజనీర్ కు ఉద్యోగ సంఘాల వినతి

మెండోరా , బతుకమ్మ :

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల  విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం లో పని చేస్తున్న ఉద్యోగుల బదిాలీల ప్రక్రియ చెపట్టాలని ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులలు  డిమాండ్ చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ జల  విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం చీఫ్ ఇంజనీర్ వి.రమేష్ బాబుకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని గురువారం వినతిపత్రం అందజేశారు. గత మూడు సంవత్సరాల నుంచి బదిలీల ప్రక్రియ చేపట్టడం లేదు అలాగే చాలా కాలం నుంచి ఉద్యోగులు ఒక ప్లాంట్ నుంచి మరొక ప్లాంట్ గాని విద్యుత్ సౌదలో ట్రాన్స్ఫర్లు పెట్టుకొని బదిలీల ప్రక్రియ కోసం వేచి చూస్తున్నామన్నారు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్ పాలసీ రూపొందించాలని, ఇటీవల జెన్కోలో నియామకమైన నూతన అసిస్టెంట్ ఇంజనీర్లకు పోస్టింగులు ఇవ్వకముందే అంతర్గత బదిలీలు చేపట్టాలన్నారు. రామగుండంలో నూతనంగా నిర్మించబోయే ప్లాంటును పూర్తిగా జెన్కో ఆధ్వర్యంలోని నిర్మించాలని కోరుతూ పోచంపాడు జల విద్యుత్ కేంద్రంలోని కార్యాలయం లో ఇంజనీర్లు రమేష్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమం లో ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article