నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ వైద్య మండలి తనిఖీలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్, బాన్సువాడ ప్రాంతాల్లో తెలంగాణా మెడికల్ కౌన్సిల్ రెండు బృంధాలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీ వైద్యుల నిర్మూలన దిశగా మెడికల్ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎంసి తనిఖీలు చెపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణా వైద్య మండలి వైస్ చైర్మన్ డా శ్రీనివాస్, సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ని యాంటీ క్వేకరి బృందం నిజామాబాద్ , బాన్సవాడ లోని పలు నకిలీ వైద్యుల క్లినిక్లపై తనిఖీలు నిర్వహించారు. 30 క్లినిక్ లపై తనిఖీలు 15 మంది నకిలీ వైద్యుల గుర్తించారు. ఈ తనిఖీలలో… నకిలీ డిగ్రీ పేరుతో సమీర్ రాయ్ ప్రియాంక క్లినిక్ , జుగల్రాయ్ దేవిక రాయ్ భారతి క్లినిక్ పేర్లతో కనీస విద్య అర్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తూ విచ్చలవిడిగా యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు పైల్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు గుర్తించారు. వీరి వద్ద హేతు బద్ధత లేకుండా రోగులకు ఇచ్చిన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వందల సంఖ్యలలో బయటపడ్డాయి. వీరిపై ఎన్ ఎం సి చట్టం 34,54 ప్రకారం కేసు నమోదు చేయనున్నట్టు మరియు ఈ చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్ష తో పాటు 5 లక్షల వరకు జరిమానా విధిస్తారని డా శ్రీనివాస్ తెలియ చేసారు. నకిలీ వైద్యుల క్లినిక్ లకు అనుభందంగా ఉన్న మెడికల్ స్టోర్స్ లో సైతం క్వాలిఫైడ్ డాక్టరు ప్రెస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్ లు లేకుండా ఆంటిబయోటిక్, స్టేరాయిడ్, ఇతర షెడ్యూల్ H డ్రగ్స్ విక్రయిస్తినట్టు గుర్తించామని సంబంధిత రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ తో పాటు ఫార్మసీ కౌన్సిల్ కి ఫిర్యాదు చేయనున్నట్లు సభ్యులు డా బి.రాజ్ కుమార్ తెలియ చేసారు. తెలంగాణా మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా విష్ణు, కో ఆప్ట్ సభ్యులు డా విజయ్ కుమార్ లు తనిఖీలలో పాల్గోన్నారు.
