27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బతుకమ్మ ఎఫెక్ట్..

Must read

📰 Generate e-Paper Clip

  • – బతుకమ్మ కథనానికి స్పందించిన అధికారులు
  • – కబ్జాకు గురైన భూమిని పరిశీలించిన తహసిల్దార్

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామ శివారులో గల కంచపల్లి సాయిలు- గంగమణి వారికి చెందిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశారని, మాభూమి మాకు ఇప్పించండి సారు.. అనే శీర్షికపై ఆదివారం బతుకమ్మ పత్రికలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు స్పందించిన సబ్ కలెక్టర్ రుద్రూర్ మండల తహసిల్దార్ కు ఫోన్ ద్వారా బాధితుల సమస్యల పై సమగ్రా విచారణ చేసి వారికి న్యాయం చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశించడం జరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రుద్రూర్ మండల తహసీల్దార్ తారాబాయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్ తమ సిబ్బందితో కలిసి కబ్జా అయిన భూమిని క్షుణ్ణంగా పరిశీలించి డిజిటల్ సర్వే నిర్వహించి కొలతలు కొలిచారు. త్వరలో న్యాయం జరిగేలా చూస్తామని తహసీల్దార్ తారబాయి బాధితులకు తెలిపారు.

More articles

Latest article