24 C
Hyderabad
Sunday, August 2, 2026

మారని రిజిస్ట్రేషన్ శాఖ

Must read

📰 Generate e-Paper Clip

 . సబ్ రిజిస్ర్టార్ ను మార్చినా అదే తీరు

. అర్బన్ లో  రిజిస్ర్టేషన్ లు అంతంత మాత్రమే

. కొర్రీలు పెడుతూ రిజిస్ర్టేషన్ ల నిలిపివేత జరుగని రిజిస్ర్టేషన్ లు

. సబ్ రిజిస్ర్టార్ తో బీజేపీ నేత బస్వా లక్ష్మీనారాయణ వాదన

 నిజామాబాద్, బతుకమ్మ:  నిజామాబాద్ స్టాంప్స్ అండ్ రిజస్ర్టేషన్ కార్యాలయం వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. అధికారులు ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా రిజిస్ర్టేషన్ ల సంఖ్య పెరగడం లేదు. నిజామాబాద్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో గురువారం 45 డాక్యుమెంట్లు టేబుల్ మీదకు రాగా 7 మాత్రమే పూర్తయ్యాయి. జిల్లా రిజిస్ర్టార్ చెప్పినా ప్రస్తుత రిజిస్ర్టార్ డాక్యుమెంట్లను రిజిస్ర్టేషన్ చేయడానికి ససేమిరా అంటున్నారు. దస్త్రాలలో చిన్న తప్పులు ఉన్నా పక్కన పెట్టేస్తున్నారు. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా నిజామాబాద్ అర్బన్ కార్యాలయంలో  రిజిస్ర్టేషన్ పూర్తయిన డాక్యుమెంట్ లను ఇప్పటికీ చాలా మందికి చేతికి ఇవ్వలేదని అందుకు స్కానింగ్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య సబ్ రిజిస్ర్టార్ తో ప్రస్తుత పరిస్థితిపై వాదానకు దిగారు. అంత జరిగినా ఆయన డాక్యుమెంట్ కు పెండింగ్ డాక్యుమెంట్ నంబర్ జారీ చేసి పక్కన పెట్టేశారు.

నిజామాబాద్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్లు అంతంతగానే జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా డాక్యుమెంట్ రైటర్లకు, సబ్ రిజిస్ర్టార్ కు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ ఏడాది జరిగిన ఎస్ఆర్ ల బదిలీల నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ కార్యాలయానికి ఇద్దరు సబ్ రిజిస్ర్టార్లను కేటాయించిన విషయం తెలిసిందే. నాటి నుంచి రిజస్ర్టేషన్ లు మందకొడిగా సాగుతున్నాయి. దీనికి కారణంగా ఎస్ ఆర్ లేనని దస్తావేజు లేఖరులు ఆరోపణలు చేస్తున్నారు. కావాలని ఎస్ఆర్ లు రిజిస్ర్టేషన్ లు చేయడం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి సైతం ఫిర్యాదు చేశారు. జిల్లా రిజిస్ర్టార్ కు వ్యతిరేకంగా  రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కలిసి డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలిపారు. ఈ వివాదాన్ని సద్దుమణిపించేందుకు నిజామాబాద్ రూరల్ కార్యాలయం సబ్ రిజిస్ర్టార్ కార్యలయం ఎస్ఆర్ ను నిజామాబాద్ అర్బన్ కు మార్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. జిల్లాలో 10 ఎస్ఆర్ కార్యాలయాలు ఉండగా.. అందులో అత్యధికంగా నిజామాబాద్ లో 70 పైచిలుకు రిజిస్ర్టేషన్ లు జరగడంతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం సబ్ రిజిస్ర్టార్లు నేరుగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దాని వెనుక మతలబు ఉందని దస్తావేజు లేఖరులు ఆరోపిస్తున్నారు. జిల్లా రిజిస్ర్టార్ ప్రసూన మాత్రం ఖచ్చితంగా డాక్యుమెంట్ లలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సక్రమంగా ఉంటే మాత్రం రిజిస్ర్టేషన్ చేస్తున్నామని అంటున్నారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో దళారులకు అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదాల పేరుతో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Unchanged Registration Department

More articles

Latest article