- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాట్లాడే అర్హత లేదు
- టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ (చిన్నా)
ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని 12 మంత్రుల పై కేటీఆర్ చిల్లరగా మాట్లాడడం మానుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం నేర్పిస్తామని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ శ్రీనివాస్ (చిన్నా) అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏ బి శ్రీనివాస్ (చిన్నా) స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మంత్రివర్గంపై అహంకారపూరితంగా మాట్లాడడం పట్ల తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ఒక చిల్లర వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు రాజకీయ ఉద్యోగాలు వచ్చాయన్నారు. హరీష్ రావు భూములతో పాటు పాల వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. మాజీ ఎంపీ కవిత లిక్కర్ వ్యాపారంలో కోట్లు గడిచారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు డింగర బిచ్చగాళ్ళని ఆర్మూర్ కు 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే అన్ని హామీలు నెరవేర్చారని, మిగిలిన ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకాన్ని అమలుచేసి చూపిస్తారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా రంజక పాలనను చూసి అధికారం లేక కేటీఆర్, హరీష్ రావు పిచ్చి ఎక్కి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఏడాది కావస్తున్నా కేసిఆర్ పత్తా లేకుండా పోయిండని చెప్పారు. రాష్ట్ర మంత్రులను కేటీఆర్ బేకార్ గాళ్ళు అంటే ఖబర్దార్ అని మాట్లాడే పద్ధతి, భాష మార్చుకోనట్లయితే తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అవినీతిపరులైన కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఆర్మూర్ లో పదేళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అరాచకాలు చూసి ప్రజలు ఎన్నికలలో గుణపాఠం నేర్పించారన్నారు. ఆర్మూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించి పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నాయకులు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే టిపిసిసి కి ఫిర్యాదు చేయాలని సూచించారు. మూసిని రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షళన చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఈనెల 19న వరంగల్ లో కాంగ్రెస్ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్, పట్టణ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్, ఏఎంసి డైరెక్టర్ ఫయాజ్, ప్రధాన కార్యదర్శి షేక్ పాషా, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలకిషన్, కాంగ్రెస్ నాయకులు అజ్జు, హబీబ్, బట్టు శంకర్, అబ్దుల్ ఫయిమ్, దుమాని నందు, రాజ్ కుమార్, రమణ, ఆవేజ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
