23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

సమగ్ర సర్వే పరిశీలించిన ఎంపీడీవో

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: దోంచందలో సామాజిక,ఆర్థిక,విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే వివరాల నమోదును అలాగే సమగ్ర కుటుంబ సర్వే ఫారంలు క్లుప్తంగా నింపే విధానాన్ని ఏర్గట్ల ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఎంపీడీవో మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఫారములను తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో సర్వే లక్ష్యాలు నెరవేర్చి బాధ్యత మీపైనే ఉంది అని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఎన్యుమరేటర్లు సర్వేలో క్వాలిటీ తో పాటు క్వాంటిటీని కూడా ఫోకస్ చేసుకుంటూ ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవకతవలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. సర్వేకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బ్లాక్ లలో సర్వే పక్రియ కొనసాగించాలని ఎంపీడీవో వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ సిబ్బందికి సరైన సమాచారాన్ని ఇచ్చి సమగ్ర సర్వే సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఇట్టి కార్యక్రమంలో మండల ఎంపీఓ శివ చరణ్, పంచాయితీ కార్యదర్శి గణేష్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article