29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐక్యంగా నిలిచి హక్కుల సాధనకు కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

బోధన్, బతుకమ్మ : ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం టీఎన్జఓ కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం.హుస్సేన్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఐక్యంగా ఉండాలని టీఎన్జీఓ జిల్లా  అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పిలుపునిచ్చారు. బోధన్ లో నిర్వహిస్తున్న టీఎన్జీఓ సభ్యత్వ నమోదు యూనిట్ కార్యాలయాన్ని బుధవారం సందర్భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదుల పాల్గొని రశీదు విధిగా పొందాలని తెలిపారు. ఉద్యోగులందరరూ ఐక్యంగా ఉండాలని అన్నారు. దీనికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జిఓ కేంద్రభాద్యులు పోల శ్రీనివాస్, కోశాధికారి దినేష్ బాబు, బోధన్ యూనిట్ కార్యదర్శి జనార్ధన్, సిటీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, ఉమా కిరణ్, సాయిలు, గురుచరణ్  బోధన్ యూనిట్ పూర్వధ్యక్షులు సాయిబాబా, వివిధ శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

We should stand united and work for the realization of rights

More articles

Latest article