28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కేజీబీవీ ఘటనపై విచారణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల మండల కేంద్రంలోని కెజీబీవీ స్కూల్లో ఆదివారం  9 వ తరగతి విద్యార్థి కర్రే అంజలి ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు నుండి కింద పడిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన కర్రె అంజలి ఏర్గట్ల కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఇటీవల తన సొంత గ్రామానికి వెళ్లి ఆదివారం అంజలి స్కూల్ కి రావడం,  తన దుస్తులను శుభ్రపరచుకొని రెండవ అంతస్తు లో ఆరవేయడానికి వెళ్లిన సందర్భంలో అక్కడే వేచి ఉన్న కోతుల గుంపు అంజలి మీదికి రావడంతో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి కిందపడి చేయి విరిగి వెల్లుపూసకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే కేజీబీవీ స్కూల్ సిబ్బంది విద్యార్థి అంజలిని 108 లో మెట్ పల్లి కి దగ్గరలో ఉన్న మేడిపల్లి హాస్పిటల్ కి తీసుకపోయి,తర్వాత ఆర్మూర్ ఎముకల హాస్పిటల్లో చూపించి ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఈ విషయంలో సోమవారం  కేజీబీవీ విద్యార్థి అంజలి కి జరిగిన ఘటన జరిగిన స్థలాన్ని మండల ఎమ్మార్వో శ్రీలత, మండల ఎంఈఓ ఆనంద్ రావు,ఏర్గట్ల పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి, ఆర్ ఐ సదానంద్, జరిగిన సంఘటన పై విచారణ జరిపి ఇకముందు ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More articles

Latest article