23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

జిలకర్ విజయానంద్ కు జేసీఐ అలుమ్ని క్లబ్ ఉత్తమ ప్రతిభ అవార్డులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :               

జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలుమ్ని క్లబ్ ఆద్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన  జోన్ కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ కు చెందిన జిలకర్ విజయానంద్ కు జోన్ ఉత్తమ  సభ్యుడిగా పురస్కారం దక్కింది. 2024లో నిర్వహించిన  సేవా కార్యక్రమాలతో పాటు జోన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గానూ జోన్ చైర్మన్ జి. వి. ఎన్.రాజు జెసిఐ జాతీయ ప్రతినిధులు సునీల్ కుమార్ రుమాళ్ళ, వినయ్ మెహతా,మనోజ్ టక్కర్ విజయానంద్ కు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జోన్ అధికారులు నవీన్ చావ్లా,డీవీఎస్పీ గుప్త,రాజేశ్వర్ ,శీతల్ ,శ్రీపూజ ,జేసీఐ ఇందూర్ పూర్వాధ్యక్షులు పద్మశ్రీనివాస్ ,జిలకర్ లావణ్య పాల్గొన్నారు.

More articles

Latest article